Kamareddy Blade Attack | కామారెడ్డిలో దారుణం.. మహిళపై రేజర్ బ్లేడ్​తో దాడి

కామారెడ్డి పట్టణంలో పట్టపగలు దోపిడీ ఘటన కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Blade Attack | పట్టణంలో (Kamareddy) పట్టపగలు దోపిడీ ఘటన కలకలం రేపింది. స్థానిక విద్యానగర్ కాలనీలో ఇంట్లో ఉన్న ఓ మహిళపై ఆగంతకుడు రేజర్​ బ్లేడ్​తో (Razor Blade Attack) దాడికి తెగబడ్డాడు.

Kamareddy Blade Attack | ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ కాలనీకి చెందిన జొన్నాల సునీత ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. రేజర్ బ్లేడుతో ఆమె పెదవిపై గాయపరిచి, చంపుతానని బెదిరించి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కుని పారిపోయాడు. దోచుకెళ్లిన పుస్తెలతాడులో రెండు పోగులు, మూడు బంగారు పూసలు, రెండు పుస్తెలు ఉన్నాయని, దాని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కామారెడ్డి పోలీసు స్టేషన్​లో (Kamareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: చీమ లాంటి వినాయకుడి రథం.. మైక్రో ఆర్టిస్ట్ నైపుణ్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *