Social Welfare School Incident | సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థిని కిందపడి గాయాలు

విద్యార్థిని నిద్రమత్తులో బెడ్‌ నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు దిగుతుండగా కిందపడిపోయి స్పృహ కోల్పోయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Social Welfare School Incident | కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఓ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి కళ్లు తిరిగి కిందపడటంతో విద్యార్థిని తలకు బలమైన గాయమైనట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తలకు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. తనకు కళ్లు తిరుగుతున్నాయని విద్యార్థిని వార్డెన్‌కు చెప్పినప్పటికీ, గతంలోనూ ఇదే విషయాన్ని చెబుతున్నావంటూ వార్డెన్ మందలించినట్లు సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.

Social Welfare School Incident | కామారెడ్డిలో నిరాకరించడంతో…

విద్యార్థినిని వార్డెన్ తన వ్యక్తిగత కారులో కామారెడ్డిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ చికిత్స అందించేందుకు ఆస్పత్రులు నిరాకరించడంతో అదే రోజు అర్ధరాత్రి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ వైద్యులు విద్యార్థినికి తలకు శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం.

Telangana Panchayat Act Amendment | పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ..ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా ఖాతాల్లోకే నిధులు

శస్త్రచికిత్స అనంతరం విద్యార్థిని కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నట్లు సమాచారం. ఆస్పత్రి చికిత్సకు సంబంధించిన ఖర్చులను విద్యార్థిని తల్లితోనే చెల్లిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Social Welfare School Incident | బయటకు పొక్కకుండా జాగ్రత్తలు..

ఇదిలా ఉండగా, ఘటన జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాల సిబ్బంది మాత్రం విద్యార్థిని నిద్రమత్తులో బెడ్‌ నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు దిగుతుండగా కిందపడిపోయి స్పృహ కోల్పోయిందని చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. విద్యార్థినికి అందుతున్న వైద్య చికిత్స, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *