Telangana Panchayat Act Amendment | పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ..ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా ఖాతాల్లోకే నిధులు

గ్రామసభల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్య బద్ధత పెరుగుతుంది. తాగునీరు, శానిటేషన్, వీధి దీపాల వంటి నిత్యవసరాలకు నిధుల కొరత లేకుండా వేగంగా చర్యలు తీసుకోవచ్చు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్Telangana Panchayat Act Amendment | తెలంగాణలోని గ్రామ పంచాయతీల నిధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారా ట్రెజరీలతో నిమిత్తం లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నిధులను జమ చేసే వెసులుబాటును కల్పించింది.

ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తున్నప్పటికీ, సరైన పర్యవేక్షణ లేకపోతే నిధుల దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Panchayat Act Amendment | నేరుగా ఖాతాల్లోకే నిధులు

స్థానిక పన్నుల ద్వారా వచ్చే నిధులతో పాటు కేంద్రం అందించే 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) గ్రాంట్లను నేరుగా నేషనలైజ్డ్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లోని ప్రత్యేక ఖాతాల్లో జమ చేసుకోవచ్చు.

కేంద్ర నిధుల్లో 50%-60% ‘టైడ్ నిధులు’గా (తాగునీరు, డ్రైనేజీ, శానిటేషన్, వీధి దీపాలు), మిగతా 40% ‘అన్-టైడ్ నిధులు’గా (రోడ్ల నిర్మాణం, స్థానిక అవసరాలు – గ్రామసభ ఆమోదంతో) ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Telangana Panchayat Act Amendment | నిధుల వినియోగంలో వేగం

ట్రెజరీలు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే రెడ్ టేపిజం అంతమై, పనులు పూర్తయ్యాక బిల్లుల చెల్లింపులు వేగవంతమవుతాయి. ఏ అభివృద్ధి పనికి ప్రాధాన్యం ఇవ్వాలో గ్రామానికే నిర్ణయించే అధికారం లభిస్తుంది. గ్రామసభల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్య బద్ధత పెరుగుతుంది. తాగునీరు, శానిటేషన్, వీధి దీపాల వంటి నిత్యవసరాలకు నిధుల కొరత లేకుండా వేగంగా చర్యలు తీసుకోవచ్చు.

Trump Media Lawsuit | ట్రంప్‌పై CNN, MS NOW, Politico సంయుక్తంగా దావా!

Telangana Panchayat Act Amendment | నిధుల దుర్వినియోగం అయ్యే ప్రమాదం

ఎలాంటి ప్రభుత్వ పర్యవేక్షణ, ముందస్తు అనుమతులు లేకపోతే స్థానిక నాయకులు, అధికారులు నిధులను దారిమళ్లించే, దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. స్థానిక పన్నుల వసూళ్లలో స్వపక్షపాతం చూపడం, పన్నుల మినహాయింపులు ఇవ్వడం వల్ల పంచాయతీ ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉంది. కఠినమైన ఆడిటింగ్ వ్యవస్థ లేకపోతే అవకతవకలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి..? ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై స్పష్టత కొరవడుతుంది.

పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం శుభపరిణామమే అయినా, నిధులు సద్వినియోగం కావాలంటే డిజిటల్ కంట్రోల్/అప్రూవల్ (Digital Approvals) వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆడిటింగ్, పర్యవేక్షణ బాధ్యతలను ఒక నిర్దిష్ట అధికారి పర్యవేక్షణలో ఉంచడం ద్వారా మాత్రమే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసి, నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించవచ్చని భావిస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *