Adilabad RIMS Incident | ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. చిన్నారుల వార్డులో పేలిన ఏసీ.. 5 రోజుల శిశువు దుర్మరణం.. 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం!

ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adilabad RIMS Incident | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి చిన్నారుల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Adilabad RIMS Incident | అర్ధరాత్రి సమయంలో పొగలు

రిమ్స్‌లోని ఎస్ఎన్‌సీయూ వార్డులో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఏసీ నుంచి పొగలు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ చిన్నారులను తీసుకుని వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి చిన్నారులను పక్క వార్డుకు తరలించారు.

Telangana Panchayat Act Amendment | పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ..ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా ఖాతాల్లోకే నిధులు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిమ్స్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందడంతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Adilabad RIMS Incident | ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు

మరో 24 మంది చిన్నారులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *