NIMS ACB Raids | నిమ్స్​ అడిషనల్​ సూపరింటెండెంట్ నివాసాల్లో ఏసీబీ దాడులు

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : NIMS ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల మేరకు నిమ్స్ (NIMS) అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ దాడులు చేపట్టింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది.

NIMS ACB Raids | 12 ప్రాంతాల్లో సోదాలు

నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అదనపు సూపరింటెండెంట్​ లక్ష్మీ భాస్కర్‌ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ సమాచారం అందింది. దీంతో ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. మూడు జిల్లాల్లోని 12 ప్రదేశాల్లో ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మూసాపేటలోని కల్పతరు రెసిడెన్సీలో భాస్కర్ నివాస ప్రాంతంలో, అలాగే ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల అనంతరం అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Adilabad RIMS Incident | ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. చిన్నారుల వార్డులో పేలిన ఏసీ.. 5 రోజుల శిశువు దుర్మరణం.. 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *