Congress Rajya Sabha Candidates | రాహుల్ గాంధీ సన్నిహితులకు పెద్దపీట: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Congress Rajya Sabha Candidates | రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా పేరున్న నేతలకు ఈ జాబితాలో పెద్దపీట వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇందులో భాగంగానే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీనాక్షి నటరాజన్‌ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల అధికారిక జాబితాను కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. ఈ మేరకు AICC జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ సంతకంతో కూడిన అధికారిక పత్రికా ప్రకటనను జూన్ 4, 2026న విడుదల చేశారు.

Image

Congress Rajya Sabha Candidates | 7 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

AICC విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం.. మొత్తం 5 రాష్ట్రాల్లోని 7 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది.

రాష్ట్రం: ఎంపికైన అభ్యర్థి

  • కర్ణాటక: మల్లికార్జున ఖర్గే
  • కర్ణాటక: పవన్ ఖేరా
  • కర్ణాటక: మన్సూర్ అలీ ఖాన్
  • మధ్య ప్రదేశ్: మీనాక్షి నటరాజన్
  • రాజస్థాన్: నీరజ్ డాంగి
  • తమిళనాడు: ప్రవీణ్ చక్రవర్తి
  • జార్ఖండ్: ప్రణవ్ ఝా

akshara today .jpgkharge

Congress Rajya Sabha Candidates | కీలక నేతలకు దక్కిన ప్రాధాన్యం

కర్ణాటక నుంచి స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ కీలక నేత పవన్ ఖేరాను బరిలో నిలుపుతున్నారు. తమిళనాడు నుంచి పార్టీ డేటా అనలిటిక్స్ విభాగాధిపతి ప్రవీణ్ చక్రవర్తికి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాకు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది.

తెలంగాణ ఇంఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్ నుంచి అవకాశం దక్కడం గమనార్హం. రాహుల్ గాంధీ బృందంలో చురుగ్గా పనిచేసే నేతలకు ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రాధాన్యం దక్కినట్లు స్పష్టమవుతోంది.

Rajesh Exports KTR | ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ సెబీ సెన్సేషన్.. తెలంగాణ…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *