Anganwadi Holidays Extension | అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు పొడిగింపు: జూన్ 15న పునఃప్రారంభం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anganwadi Holidays Extension | రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులను జూన్ 13, 2026 వరకు పొడిగిస్తూ మహిళా అభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు మహిళా అభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా గురువారం అధికారిక సర్క్యులర్ (Memo No.954/ICDS-2/2024) విడుదల చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

tg

Anganwadi Holidays Extension | 15న యథావిధిగా ఓపెన్​

సెలవుల అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు జూన్ 15, 2026న యథావిధిగా తెరుచుకుంటాయి.

సెలవుల కాలంలో కేంద్రాలలో వండిన ఆహారానికి (Hot-cooked meals) బదులుగా, లబ్ధిదారులకు నేరుగా ‘టేక్ హోమ్ రేషన్’ (Take Home Ration – THR) అందజేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని జిల్లా సంక్షేమ అధికారులు (DWOs), చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారులు (CDPOs), సూపర్‌వైజర్లు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డైరెక్టర్ సూచించారు.

akshara today .jpganganwad

BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *