తెలంగాణBhagirath Sai POCSO Case | భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పోలీస్​ స్టేషన్​ను​...

Bhagirath Sai POCSO Case | భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పోలీస్​ స్టేషన్​ను​ ముట్టడించిన మహిళలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhagirath Sai POCSO case | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది మహిళలు పోలీస్ స్టేషన్ వెలుపల భారీ నిరసన చేపట్టారు.

Bhagirath Sai POCSO case | కేసు నేపథ్యం..

మొయినాబాద్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఒక మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై భగీరథ్ సాయిపై పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. బాధితురాలు , ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు శుక్రవారం ఆయనపై పోక్సో (POCSO) చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Bhagirath Sai POCSO case | నిరసనకారుల డిమాండ్..

నిందితుడిపై కేసు నమోదై రెండు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై మహిళా సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే అరెస్టులో జాప్యం జరుగుతోందని నిరసనకారులు పోలీసులను ప్రశ్నించారు. ఈ నిరసన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని నిరసన తెలిపిన మహిళలు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BC Caste Census | జాతీయ జనగణనలో బీసీ కులగణన సైతం చేపట్టాలి

అక్షరటుడే, ఇందూరు: BC Caste Census | దేశవ్యాప్తంగా చేపట్టబోయే జాతీయ...

Chandrababu Delhi Tour | రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ

అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Delhi Tour| ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

Farmers Protest Movement | దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేస్తాం : ఏఐయూకేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నామని...