Revanth Reddy Countdown | రేవంత్​రెడ్డికి కౌంట్​డౌన్​ మొదలైంది : హరీశ్​రావు

సీఎం రేవంత్​ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్​డౌన్​ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Revanth Reddy Countdown | సీఎం రేవంత్​ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్​డౌన్​ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.

Revanth Reddy Countdown | పంటలు ఎండిపోతున్నా..

సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని హరీశ్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు రోడ్డెక్కారని, కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గమన్నారు. రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా అని ప్రశ్నించారు. సొంత గ్రామంలో రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు.

ఇది కూడా చదవండి..: Telangana 1 Crore Insurance | దేశంలోనే ఫస్ట్ టైమ్.. ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి ఉచిత బీమా..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *