అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda murder case | నల్గొండ (Nalgonda) నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులోని ఓ గదిలో హత్య వెలుగు చూసింది. గదిలో వ్యక్తి మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డీఎస్పీ (DSP) శివరామరెడ్డి, సీఐ ఆదిరెడ్డి వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు.
Nalgonda murder case | కూలి డబ్బుల కోసం..
కూలి డబ్బుల కోసం జరిగిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని తమిళనాడుకు చెందిన మరియన్ ముత్తుగా గుర్తించారు. ఆ గదిలో తమిళ కూలీలు ఉంటున్నారు. ఈ క్రమంలో కూలి డబ్బుల విషయంలో వివాదం మొదలై గొడవ పెద్దది కావడంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Pakistan Suicide Bombing | పాక్లో ఆత్మాహుతి దాడి..12 మంది దుర్మరణం..30 మందికి తీవ్ర గాయాలు