Forgery Case | ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో చందరి సంతోష్ సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Forgery Case | కల్యాణలక్ష్మి (Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల్లో లబ్ధి పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా కామారెడ్డిలో ప్రభుత్వ వైద్యుని సంతకం, అధికారిక సీల్ నకిలీ ఘటన వెలుగులోకి వచ్చింది.

Forgery Case | సంక్షేమ పథకాల కోసం..

సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు ప్రభుత్వ వైద్యుని సంతకం, సీల్‌ను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో చందరి సంతోష్ బుధవారం కొన్ని ధృవపత్రాలను పరిశీలించగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని, తన అనుమతి లేకుండా అధికారిక సీల్‌ను ఉపయోగించినట్లు గమనించారు. ఈ నకిలీ పత్రాలను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు వినియోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై గురువారం సాయంత్రం ఆయన కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి చర్యలతో ప్రభుత్వ రికార్డుల విశ్వసనీయత దెబ్బతినడంతో పాటు వైద్యుని వృత్తిపరమైన ప్రతిష్ఠకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ సంతకాలు చేసిన వారు, సీల్ దుర్వినియోగం చేసిన వారితో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.

దీనిని కూడా చదవండి : Kamareddy Municipal Meeting | బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం.. మున్సిపల్ సమావేశంలో రసాభాస

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *