Yellareddy Municipality | 26 ఏళ్లుగా నిరంతరంగా అంబలి వితరణ అభినందనీయం: ఎమ్మెల్యే మదన్​ మోహన్

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | వేసవిలో ప్రజల కోసం 26 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని (Ambali Distribution) ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్​ మోహన్ ​(Mla Madan Mohan) అన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ పట్టణంలో (Yellareddy Municipality) 26 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబలి వితరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

Yellareddy Municipality | మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ సేవలు అభినందనీయం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. 26 ఏళ్లుగా అంబలి కేంద్రం నిర్వహిస్తున్న సత్యం సేవలు అభినందనీయమని కొనియాడారు. వేసవి కాలంలో ప్రజలకు చల్లని, ఆరోగ్యకరమైన అంబలి అందించడం ఎంతో అవసరమన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడడంలో అంబలి కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సాతెల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధా నాగరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులను ఆశీర్వదించారు.

67 1

ఇది కూడా చదవండి: Govt arrears release | ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *