టెక్నాలజీAsk YouTube Feature | వీడియో స్ట్రీమింగ్‌లో ఏఐ జోరు.. యూట్యూబ్‌లోకి సరికొత్త ఫీచర్!

Ask YouTube Feature | వీడియో స్ట్రీమింగ్‌లో ఏఐ జోరు.. యూట్యూబ్‌లోకి సరికొత్త ఫీచర్!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, సెర్చ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసేలా ‘ఆస్క్‌ యూట్యూబ్‌’ అనే ఏఐ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

అక్షరటుడే, న్యూఢిల్లీ: Ask YouTube Feature | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, సెర్చ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసేలా ‘ఆస్క్‌ యూట్యూబ్‌’ (Ask YouTube) అనే ఏఐ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు సెర్చ్ బార్‌లో ఏదైనా వెతికితే కేవలం వీడియోల జాబితా మాత్రమే వచ్చేది, కానీ ఇకపై ఏఐ నేరుగా మీతో సంభాషించనుంది.

Ask YouTube Feature | ఏమిటీ ‘ఆస్క్ యూట్యూబ్’?

ఇది యూట్యూబ్ సెర్చ్‌బార్‌లో అందుబాటులోకి వచ్చే ఒక ఏఐ చాట్‌బాట్. యూజర్లు ఏదైనా అంశంపై ప్రశ్నలు అడిగినప్పుడు, ఈ ఫీచర్ కేవలం వీడియోలను చూపించడమే కాకుండా, వాటిలోని ముఖ్య సమాచారాన్ని విశ్లేషించి ఒక టెక్స్ట్ సారాంశాన్ని (Text Summary) కూడా అందిస్తుంది.

Ask YouTube Feature | ఎలా పనిచేస్తుంది?

సెర్చ్ బార్‌లో మీరు వెతికేటప్పుడు ‘ఆస్క్ యూట్యూబ్’ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఒక పూర్తి పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కావాల్సిన సందేహాలను టైప్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా లాంగ్ ట్రిప్ గురించి అడిగితే.. దానికి సంబంధించిన వీడియోలతో పాటు, మార్గమధ్యలో చూడదగ్గ ప్రదేశాలు, జాగ్రత్తల గురించి ఈ ఏఐ సలహాలను కూడా ఇస్తుంది. సుదీర్ఘమైన వీడియోలు చూడక్కర్లేకుండానే, ఆ వీడియోల్లోని ముఖ్య విషయాలను ఇది క్లుప్తంగా వివరిస్తుంది.

Ask YouTube Feature | త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా..

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమెరికాలోని 18 ఏళ్లు పైబడిన కొంతమంది యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి..: Hyundai Ioniq 5 Facelift | హ్యుందాయ్ కొత్త అయానిక్ 5 ఫేస్‌లిఫ్ట్.. సింగిల్ చార్జింగ్ తో 690 కి.మీ. ప్రయాణం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...