నిజామాబాద్Kos Nizamabad | కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థుల ప్రభంజనం.. స్టేట్ ర్యాంకులతో సత్తా..

Kos Nizamabad | కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థుల ప్రభంజనం.. స్టేట్ ర్యాంకులతో సత్తా..

పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో నిజామాబాద్​ కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Kos Nizamabad | పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో నిజామాబాద్​ కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. స్టేట్​ ​ర్యాంకులతో సత్తా చాటారు. మరియా అరీష 589, సీహెచ్​.వర్ష 588, బి.శ్రీకర్​ 585, జాహ్నవి 583, కె.అక్షర 583 అత్యుత్తమ మార్కులు సాధించారు.

Kos Nizamabad | స్కూల్ స్థాయి నుంచే..

కేవోఎస్​లో స్కూలు స్థాయి నుంచే ఐఐటీ బోధనతో పాటు ప్రణాళికా బద్ధంగా బోధన సాగడంతో ఇంటర్మీడియట్​లో జాతీయ స్థాయి ఐఐటీ మెడికల్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని విద్యాసంస్థల ఛైర్​ పర్సన్​ విజయలక్ష్మి తెలిపారు. 2025, 2026 ఐఐటీ, జేఈఈ మెయిన్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Kos Nizamabad | ఉత్తమ బోధనా పద్ధతులతోనే..

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్.రామోజీ రావు అభినందించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించామన్నారు. స్కూల్​ స్థాయిలో ఉత్తమ విద్యాబోధన అందించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు సాధ్యమన్నాయని వివరించారు. అలాగే స్కూల్​ స్థాయి నుంచే ఐఐటీ, జేఈఈకి సంబంధించి మెరుగైన విద్య బోధించడం వల్ల ఇటీవల జాతీయ స్థాయి ర్యాంకులు సాధించామని చెప్పారు.

Kos Nizamabad | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట

డైరెక్టర్ సీహెచ్.తేజస్విని మాట్లాడుతూ ఎస్సెస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ పాటు వివిధ స్టేట్ ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తమ స్కూల్​ నుంచే పునాదులు పడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన జాతీయస్థాయి ఐఐటీ, మెడికల్​ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని వివరించారు. ఇందుకు తాము అందించే ప్రత్యేక బోధనా పద్ధతులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రెగ్యులర్ సిలబస్​తో పాటు ఐఐటీ ఫౌండేషన్​లో రాణించేలా ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇప్పించడం వలనే ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులకు సన్మానం

పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు రామోజీరావు, తేజస్విని, రాజా సన్మానించారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు సందీప్ కులకర్ణి, వి.రణదీశ్, ఫరీద్దుద్దీన్​, నటరాజ్, చంద్రశేఖర్, సుచరిత, వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ కవిత, ఫనీంధర్ ఫనీందర్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TS SSC Results | పదో తరగతి ఫలితాలు విడుదల

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...

Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exit Polls | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై...

Shivdhar Reddy | శివధర్​ రెడ్డికి కీలక పదవి.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shivdhar Reddy | మరికొద్ది గంటల్లో పదవీ విరమణ...