తెలంగాణTS SSC Results | పదో తరగతి ఫలితాలు విడుదల

TS SSC Results | పదో తరగతి ఫలితాలు విడుదల

విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలను రిలీజ్​ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TS SSC Results | విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు (Telangana SSC Board) మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలను రిలీజ్​ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని ఎస్‌సీఈఆర్‌టీ ప్రాంగణంలో రిజల్ట్స్​ ప్రకటించారు. మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

TS SSC Results | ఏప్రిల్​ 16న ముగిసిన పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా.. ఈ నెల 16వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ (Education Department) యుద్ధప్రాతిపదికన వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 23 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేేశారు. దీంతో ఫలితాలను అనుకున్న సమయం కన్నా ముందుగానే విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారురు.

TS SSC Results | మే మొదటి వారంలో అనుకున్నా..

తొలుత మే మొదటి వారంలో ఫలితాలు రిలీజ్​ చేయాలని అధికారులు భావించారు. ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా ఈ నెల 29నే ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూసుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్‌సైట్ల ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 8096958096 అనే నంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేసి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఫలితాల కోసం లింక్​ను క్లిక్​ చేయండి https://results.bse.telangana.gov.in/

ఇది కూడా చదవండి..: Sajjanar Exam Message | ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు.. డీజీ సజ్జనార్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....