అక్షరటుడే, కామారెడ్డి : Agniveer Selection | కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అగ్నివీర్ నియామక పరీక్షల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దేహదారుఢ్య, రాత, వైద్య పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వీరు ఈ ఘనత సాధించారు.
Agniveer Selection | అధ్యాకుల హర్షం
బీకాం సెకండియర్ విద్యార్థులు కార్తీక్, దత్తాద్రి, బీఏ ఫైనలియర్ చదువుతున్న సంగమేశ్వర్, సందీప్, బీఏ సెకండియర్ విద్యార్థి సతీష్, బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న జ్ఞానేశ్వర్, శంకర్, జైపాల్‌లు అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.కిష్టయ్య విద్యార్థులను అభినందించారు.
Agniveer Selection | క్రమశిక్షణతో కూడిన శిక్షణ వల్లే..
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాలలో పాఠ్యాంశాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణ వల్లే విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు కళాశాల పూర్వ విద్యార్థి అయిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి రాజేష్ దేహదారుఢ్య శిక్షణ అందించారని, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఏ.సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు సహకారం అందించారని ప్రిన్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Yellareddy Development | ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం


