అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Police | నగరంలో ఓ దొంగ హల్చల్ చేశాడు. అర్ధరాత్రివేళ ఏకంగా ఇళ్లలోకి దూరి ప్రజలను భయపెట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఇళ్లలోకి వెళ్లి దోచుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం(Nizamabad City) నడిబొడ్డున ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Nizamabad Police | పద్మానగర్‌లో..
నాలుగో టౌన్ పోలీసులు (Nizamabad Police Commissionerate) తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్( Padmanagar) రోడ్ నం.2,3లలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దొంగ ప్రవేశించాడు. మొదట ఓ ఇంట్లోకి ప్రవేశించిని దొంగ ఇంట్లో ఉన్న వ్యక్తిని బెదిరించి మూడు గ్రాముల గొలుసు, రూ.10వేల నగదును దోపిడీ చేశాడు. అనంతరం పక్క వీధిలో ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించి వారిని సైతం బెదిరించి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు.
అనంతరం పక్కనే మరో ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను భయపెట్టి వారి వద్ద నుంచి రూ.3,500 నగదును దోచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థానానికి చేరుకుని క్లూస్ టీంతో(Clues Team) ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh Mahanadu | లోకేశ్ సస్పెన్స్ ట్వీట్.. ఆ ‘కీలక ప్రకటన’ ఏంటి?


