Nizamabad Balasadan Girls | ముగ్గురు బాలసదన్ బాలికల అదృశ్యం.. నిజామాబాద్​లో ఘటన!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Balasadan Girls | నిజామాబాద్ నగరంలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో ఉన్న బాలసదన్ నుంచి ముగ్గురు బాలికలు వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై బాలసదన్ వార్డెన్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Nizamabad Balasadan Girls | ఇద్దరి ఆచూకీ లభ్యం..

పోలీసుల వివరాల ప్రకారం.. 14, 9, 8 సంవత్సరాల వయసు గల ముగ్గురు బాలికలు వార్డెన్‌కు చెప్పకుండా బాలసదన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలికల వివరాలను సేకరించారు. వారి స్వగ్రామాల వద్ద పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సభ్యులు కలిసి గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలను గుర్తించి తిరిగి బాలసదన్‌కు అప్పగించారు.

కానీ, మరో 9 ఏళ్ల బాలిక చిరునామా స్పష్టంగా లేకపోవడంతో ఆమె కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. బాలికను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *