తెలంగాణPalamuru Rangareddy Project | ‘పాలమూరు – రంగారెడ్డి’ పనులు పూర్తి చేయాలి : సీఎం...

Palamuru Rangareddy Project | ‘పాలమూరు – రంగారెడ్డి’ పనులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Palamuru Rangareddy Project | పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. దీంతో పాటు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District)కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సూచనలు చేశారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Palamuru Rangareddy Project | పనులు పర్యవేక్షించాలి

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, కె. రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Government Job Age Limit | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వయో పరిమితి పెంచిన ప్రభుత్వం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...

Stock Market Fall | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | ఇరాన్‌పై భారీ దాడులను...

Hyderabad Crime News|హైదరాబాద్‌లో ఘోరం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్ రేప్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Crime News| సినిమాల్లో , షార్ట్ ఫిలిమ్స్‌లో నటించే...

Moto G37 Power | మోటో నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. సేల్ ఎప్పటినుంచంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moto G37 Power | ప్రముఖ స్మార్ట్ ఫోన్...