Emergency Landing | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | శంషాబాద్​లోని రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ ఎయిర్​పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 591 ఎయిర్​లైన్స్​ విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Emergency Landing | విజయవాడ వెళ్తుండగా..

శంషాబాద్​ (Shamshabad) నుంచి 591 ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం విజయవాడ వెళ్లేందుకు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలెట్​ గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించాడు. అనంతరం విమానాన్ని తిరిగి శంషాబాద్​లో అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్లో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్​ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి..: HYDRAA | 6 వేల గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *