అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Milk Powder Smuggling | అక్రమార్కులు పిల్లల పాలపొడిని సైతం వదలడం లేదు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాల పౌడర్‌ను దారి మళ్లించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన పాలపొడిని తెలంగాణ పోలీసులు (Telangana Police) స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో పిల్లల కోసం ఉచితంగా నందిని పాలపొడి అందిస్తున్నారు. క్షీర భాగ్య పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి పాలపొడి పంపిణీ చేస్తున్నారు. అయితే దీనిని కొందరు బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. పిల్లలకు చేరాల్సిన పాలపొడిని దారి మళ్లిస్తున్నారు.
Milk Powder Smuggling | జనగామ తరలిస్తుండగా..
తాజాగా 210 కిలోల నందిని పాలపొడిని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని కర్ణాటక నుండి హైదరాబాద్ మీదుగా ఆలెర్, జనగామకు రవాణా చేస్తుండగా ఆలెర్‌లోని ఒక ప్రైవేట్ రవాణా కార్యాలయంలో కనుగొన్నారు. విచారణ నిమిత్తం రవాణా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దయా అనే వ్యక్తి దీని వెనుక ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Emergency Landing | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం