SIR Notice Mahesh Goud | ‘ఎస్​ఐఆర్​’​కు స్పందించకపోతేనే పీసీసీ చీఫ్​కు నోటీస్​ ఇచ్చారు : ఎంపీ అర్వింద్​

‘ఎస్​ఐఆర్​’​కు స్పందించలేదు కాబట్టే పీసీసీ చీఫ్​కు నోటీస్​ ఇచ్చారని ఎంపీ అర్వింద్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: SIR Notice Mahesh Goud | ‘ఎస్​ఐఆర్​’​కు (SIR) స్పందించకపోవడంతోనే పీసీసీ చీఫ్​కు నోటీస్​ ఇచ్చారని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.​

SIR Notice Mahesh Goud | రాహుల్ గాంధీ అఖల్ చోరీ

దేశంలో ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ అఖల్ చోరీ జరుగుతోందని ఎంపీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్​లో అభిప్రాయ బేధాలు ఉండడం సహజమని ఎంపీ అన్నారు. చివరికి నిర్ణయం చీఫ్​ కమిషనర్​దేనన్నారు. రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు జరుగుతూనే ఉంటాయని.. గాంధీ కుటుంబానికి ఇవన్నీ అర్థం కావన్నారు. ప్రజాస్వామ్య విధానాలు పాటించకనే కాంగ్రెస్ పార్టీ దేశంలో చీలిపోయిందని పేర్కొన్నారు. సీఈసీని అత్యధికంగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. దేశంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు.

SIR Notice Mahesh Goud | రాహుల్​గాంధీని చూసి ఎవరూ ఓటెయ్యరు..

రాహుల్ గాంధీని చూస్తే ఎవరు ఓటెయ్యరన్నారు. అందుకే ఫ్రస్టేషన్​లో రోడ్డెక్కుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా బీఎల్​వోలు ఎన్​రోల్​మెంట్​ కోసం వచ్చినపుడు మహేష్ గౌడ్ స్పందించలేదని ఎంపీ అన్నారు. అందుకే ఆయనకు నోటీసు జారీ అయిందని వివరించారు. ఆయన నిజామాబాద్ ఓటరే.. కావాలంటే నేను ఎన్​రోల్​మెంట్​ చేయిస్తాయని పేర్కొన్నారు. రోహింగ్యాలకు బంగ్లాదేశీయులను ఇక్కడ ఎన్​రోల్​మెంట్​ జరగదని ఎంపీ అర్వింద్​ అన్నారు.

ఇది కూడా చదవండి: ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ ప్రశంసలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *