అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Squash Medals | ఆసియా గేమ్స్ (Asia Games)లో భారత్ ఖాతాలో మరో రెండు రజత పతకాలు చేరాయి. స్క్వాష్ సింగిల్స్ ఫైనల్లో అభయ్ సింగ్ (Abhay Singh), అనాహత్ సింగ్ ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నారు.
స్క్వాష్ పురుషుల సింగిల్ ఫైనల్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ మలేషియా ఆటగాడితో తలపడ్డాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన అతడు మూడో సెట్లో మొదట ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అనంతరం మలేషియా ప్లేయర్ యో పుంజుకుని స్కోరును 4-4 సమం చేశాడు. చివరకు యో 11-5తో గేమ్‌ను ముగించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో అభయ్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే సౌరవ్ ఘోసల్ తర్వాత ఫైనల్ చేరిన రెండో భారత ఆటగాడిగా అభయ్ నిలిచాడు.
India Squash Medals | పోరాడి ఓటిన అనాహత్ సింగ్
స్క్వాష్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సైతం భారత్ పోరాడి ఓడింది. మలేషియా ప్లేయర్ శివసంగరి సుబ్రమణియం చేతిలో భారత క్రీడాకారిణి అనాహత్ సింగ్ (Anahat Singh) ఫైనల్లో 0-3 తేడాతో ఓడిపోయింది. దీంతో ఆమె రజత పతకం గెలుచుకుంది. 18 ఏళ్ల వయసులోనే ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరి రజత పతకం గెలుచుకున్న తొలి భారత మహిళగా అనాహత్ నిలిచింది. దీంతో భారత పతకాల సంఖ్య 32కు చేరింది. ఆసియా క్రీడల్లోనే తొలిసారి భారత క్రీడాకారులు ఒకే ఎడిషనల్లో స్క్వాష్ ఫైనల్స్ చేరి రజత పతకాలు సాధించడం గమనార్హం.
India Squash Medals | బాక్సింగ్‌లో పతకం ఖాయం
పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం అయింది. అంకుష్ పంఘల్ సెమీఫైనల్స్‌కు చేరారు. రెండు ఆర్చరీ జట్లు సెమీ ఫైనల్‌కు చేరాయి. షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ మహిళల విభాగంలో మను భాకర్ 16వ స్థానంలో నిలిచింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
5TH GOLD FOR MALAYSIA + LA28 OLYMPIC TICKET🔥
20th Asian Games Aichi-Nagoya 2026
🎾 Squash
🛎️ FinalMen’s Singles
🇲🇾 Ng Eain Yow 3-0 🇮🇳 Singh Abhay11-9
11-5
11-5HISTORY MAKER! 🇲🇾🏆
Ng Eain Yow defending his men’s singles crown as the No. 1 seed.✅ 1st M’sian to qualify… pic.twitter.com/r6DRmfBUNV
— Giarc Nibisna 🌺🇲🇾 (@craigansibin) September 27, 2026
దీనిని కూడా చదవండి : LPU SIT Probe | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై సిట్ ఏర్పాటు