LPU SIT Probe | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై సిట్​ ఏర్పాటు

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై పోలీసులు సిట్​ ఏర్పాటు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPU SIT Probe | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై పోలీసులు సిట్​ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

యూనివర్సిటీ ఘటనపై జలంధర్ రేంజ్ డీఐజీ (DIG) నవీన్ సింగ్లా మాట్లాడారు. విద్యార్థులకు కొన్ని డిమాండ్లు ఉన్నాయన్నారు. దానిపై వర్సిటీ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్​, ఇతర సమస్యలకు సంబంధించిన డిమాండ్లపై చర్చలు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్​ నమోదు చేసి, సిట్​ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రతినిధులతో కలిసి దీనిపై సమగ్ర విచారణ చేపడుతామన్నారు.

LPU SIT Probe | చర్యలు తీసుకుంటాం..

LPU వైస్ ఛాన్సలర్ జస్పాల్ సింగ్ సంధు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోపణల ఆధారంగా పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారన్నారు. విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఘటనపై వాస్తవాలు నిర్ధారిస్తామన్నారు. వాస్తవమని తేలితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఇతర డిమాండ్లను సైతం పరిష్కరిస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Godavari Flood | ఉగ్రరూపం దాల్చిన గోదావరి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *