అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Police Officers Killed | జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా దచ్చన్-మార్వా ప్రాంతంలో గస్తీ సమయంలో అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు మృతి చెందారు. వారి మృతదేహాలను ధెర్నా పోస్ట్ వద్ద గుర్తించారు.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు రాశ్పాల్ కుమార్ (40), బాబీ చంద్ (54) సైన్యంతో కలిసి గస్తీ విధుల్లో ఉన్నారు. ఈ మేరకు ధెర్నా పోస్ట్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు, బలగాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు గురువారం ఉదయం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.
Police Officers Killed | ఉగ్రవాదుల పనే..
వారిలో ఒకరి తలపై, మరొకరి వీపుపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. వీరు ధెర్నా పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న తమ సహచరులకు బదులుగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తుండగా, అక్కడ మాటు వేసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులను చంపిన తర్వాత వారి వద్ద ఉన్న ఇన్సాస్, 303 రైఫిల్స్ ఎత్తుకెళ్లారు. దాడి చేసిన ఉగ్రవాదులనుఉ పట్టుకునేందుకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కాగా బుధవారం సైతం ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డ విషయం తెలిసిందే.
దీనిని కూడా చదవండి : MBA Graduate Embraces Sainthood | కోట్ల ఆస్తులకు ‘గుడ్‌బై’.. సన్యాస బాట పట్టిన ఎంబీఏ యువతి!: 25 ఏళ్లకే సాధ్విగా మారుతున్న సంజనా