UPI Charges | యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక ఆదేశాలు

రూ.2 వేల లోపు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని కేంద్రం ఆదేశించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Charges | యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.2 వేల వరకు చెల్లింపులపై ఛార్జీలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. రూ.2 వేలలోపు లావాదేవీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి రుసుము విధించొద్దని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో యూపీఐ చెల్లింపులు (UPI Payments) రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అన్ని దుకాణాల్లో యూపీఐ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి రూ.లక్షల వరకు వినియోగదారులు పేమెంట్​ చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద మాల్స్​ వరకు యూపీఐ సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ప్రభుత్వం కీలకమైన అంశంపై స్పష్టతనిచ్చింది. రూ. 2,000 వరకు జరిగే UPI లావాదేవీలపై బ్యాంకులు లేదా చెల్లింపు వ్యవస్థ నిర్వాహకులు ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష రుసుమును వసూలు చేయొద్దని స్పష్టం చేసింది.

UPI Charges | స్పష్టత కరువు

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే తాజాగా కేంద్రం రూ.2 వేల లోపు ఛార్జీలు విధించవద్దని పేర్కొంది. దీంతో అంతకు మించి ఉంటే ఛార్జీలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రూ. 2,000 కంటే ఎక్కువ UPI చెల్లింపు చేసే వ్యక్తి ఇకపై రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ నోటిఫికేషన్ చెప్పలేదని నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్తులో విధించే ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) అనేది ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని ప్రభుత్వం ఇంతకుముందే సూచించింది. ఈ క్రమంలో రూ.2 వేలలోపు ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని ఆదేశించింది.

ఇది కూడా చదవండి..: NCP MPs BJP | బీజేపీకి బిగ్ బూస్ట్?.. 17 మంది NCP ఎంపీలు కాషాయ గూటికి.. లోక్‌సభలో 257కి బలం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *