KC Venugopal Amit Shah | అమిత్​ షాతో రాజీనామా చేయించాలి : కేసీ వేణుగోపాల్

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​కు చిత్తశుద్ధి ఉంటే అమిత్​ షాతో రాజీనామా చేయించాలని కేసీ వేణుగోపాల్ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KC Venugopal Amit Shah | కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

మోహన్​ భగవత్ గురువారం మాట్లాడుతూ.. ఆందోళన చేసినంత మాత్రానా జెన్​ జీ యువత దేశ వ్యతిరేకులు కారు అన్నారు. దీనిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. వారికి యువతపట్ల నిజాయితీ ఉంటే హోం మంత్రి అమిత్​ షా (Amit Shah)తో రాజీనామా చేయించాలని డిమాండ్​చేశారు. కనీసం పార్లమెంటుకు వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ఆయనకు నిజాయితీ ఉంటే, వారిపై జరిగిన అకృత్యాలను ఖండించాలని పేర్కొన్నారు.

KC Venugopal Amit Shah | విద్యార్థులకు అండగా నిలబడతాం

KC Venugopal Amit Shah

జార్ఖండ్‌లో JPSC-JSSC అభ్యర్థుల నిరసనపై వేణుగోపాల్ మాట్లాడారు. విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల కోసం ఎక్కడైతే నిజమైన నిరసనలు చేపడతారో, అక్కడ తాము వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నిన్న చెప్పింది కూడా అదే అన్నారు. ఎఫ్​సీఆర్​ఏ బిల్లును తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మైనారిటీ వర్గాలపై ప్రభావం చూపేంత ముఖ్యమైన బిల్లును హడావుడిగా ఆమోదించలేరన్నారు.

ఇది కూడా చదవండి..: AIIMS Bariatric Surgery | 209 కిలోల బరువున్న వ్యక్తికి బేరియాట్రిక్ సర్జరీ..విజయవంతంగా చేసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *