అక్షరటుడే,మెండోరా: SRSP Storage | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SRSP Storage | 24 వేల క్యూసెక్కులు
శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 24,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టులు దాదాపు 99 శాతం నిండిన నేపథ్యంలో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project)కు వరద నీరు కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,077.30 అడుగుల వద్ద 38.410 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,078.30 అడుగుల వద్ద 40.583 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 2.17 టీఎంసీల మేర తక్కువగా ఉంది.
SRSP Storage | కాలువలకు నీటి విడుదల..
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 442 క్యూసెక్కులు కలిపి మొత్తం 973 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Mega Job Mela | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 24న మెగా జాబ్ మేళా