Modi Political Journey | మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయం

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Modi Political Journey | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సేవా సంకల్ప అభియాన్​లో భాగంగా మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం పట్టణంలో(Kamareddy) కార్యక్రమాలు నిర్వహించారు.

Modi Political Journey | పట్టణంలోని జీపీఎన్​ రోడ్​ నుంచి..

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్ వద్ద ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సేవా జ్యోతి కలశ యాత్రను పట్టణ ప్రధాన వీధుల గుండా నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోదీ 25 ఏళ్ల ప్రస్థానం గుజరాత్, భారతదేశ అభివృద్ధిలో సువర్ణ అధ్యాయమన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలనా దక్షతను, ప్రధానిగా భారత్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటారని కొనియాడారు. నిరంతరం ప్రజాసేవ, నవభారత నిర్మాణమే ఆయన లక్ష్యమని, వికసిత భారత్ దిశగా సాగుతున్న ప్రయాణానికి అందరం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ⁨ హోం లోన్ తీసుకుంటే..జీవితాంతం ఈఎంఐ చెల్లించాలి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *