Yoga Celebrations | ఉమ్మడిజిల్లాలో ఉత్సాహంగా యోగా సంబరం..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలో  ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దా అంతా కలిసి యోగాసనాలు వేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు/బాల్కొండ: Yoga Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ఉమ్మడి జిల్లాలో  ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దా అంతా కలిసి యోగాసనాలు వేశారు.

Yoga Celebrations | కలెక్టరేట్​లో..

నగరంలోని కలెక్టరేట్​లో(Nizamabad Collectrate) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రెడ్​క్రాస్​, జిల్లా ఆయుష్​ శాఖ (AYUSH Department) ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే కలెక్టరేట్​ మైదానంలో ఉద్యోగులు, యోగా సాధకులు ఆసనాలు వేశారు. ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్​ జిల్లా అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్​, ఆయూష్​ నోడల్​ ఆఫీసర్​ గంగాదాస్​, ఫార్మసిస్ట్​ పురుషోత్తం, విద్యార్థులు, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

oga Celebrations | సైకిల్​పై కలెక్టరేట్​కు..

యోగా డే సందర్భంగా నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) పీఎస్​ ఎస్​హెచ్​వో సీహెచ్​ శ్రీనివాస్​ పోలీస్ స్టేషన్ నుండి కలెక్టరేట్​ వరకు సైకిల్​పై వెళ్లి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు.

Yoga Celebrations | బాల్కొండ మండలంలో..

బాల్కొండ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎంఈవో బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ యోగా ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేటి జీవన విధానంలో ఒత్తిడులు అధికమవుతున్న నేపథ్యంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పొందవచ్చని పేర్కొన్నారు. బాల్కొండ జ్యోతిబా పూలే క్రీడా మైదానం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల ప్రిన్సిపాల్ హైమావతి, మండల పీడీ రాజ్‌కుమార్, శ్రీనివాస్, శంకర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వర్ణలత, సంగీతతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 1 3  3 1 4

Yoga Celebrations |

police 3 yoga 2

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *