అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khammam Tragedy | ఖమ్మం జిల్లా (Khammam District)లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.
ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో లింగరాజు, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5) ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Khammam Tragedy | చిన్నారులు మృతి
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా, స్వాతి ఆరోగ్యం సైతం విషమంగా ఉంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ పని చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Khammam Tragedy | మేమేం చేశాం పాపం
ఇటీవల తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను చంపడం ఆందోళన కలిగిస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలను చిన్న చిన్న కారణాలతో చంపేస్తున్నారు. అనంతరం వారు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్‌లో తోసేశాడు. అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగాయి. మరికొందరు వివాహేతర సంబంధం మోజులో పిల్లలను చంపుతున్నారు. క్షణికావేశం, ఆకర్షణలకు లోనై ఏ పాపం తెలియని పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారు.
ఇది కూడా చదవండి..: NEET Exam Pressure | NEETకు ముందు విషాదం.. హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య