Job Scam Fraud | ఉద్యోగాల పేరుతో బీటెక్ విద్యార్థి భారీ మోసం.. రూ.1.5 కోట్ల వసూలు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Job Scam Fraud | గుంటూరు జిల్లా మంగళగిరిలో (Mangalagiri) విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. ఉన్నత చదువులు పూర్తయ్యాక మంచి ఉద్యోగాలు సాధించాలని కలలు కనే విద్యార్థుల ఆశలను ఆసరాగా చేసుకుని ఓ బీటెక్ (B.Tech) విద్యార్థి భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల పేరుతో సహచర విద్యార్థుల నుంచి కోట్ల రూపాయల మేర డబ్బులు వసూలు చేసిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, కడప (Kadapa) జిల్లాకు చెందిన విజయ్ నరసింహ మంగళగిరి పరిధిలోని ఓ యూనివర్సిటీ (University)లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తాను ఒక స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్నానని, ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించగలనని తోటి విద్యార్థులను నమ్మించినట్లు తెలుస్తోంది.

Job Scam Fraud | అనుమానం రావ‌డంతో..

అంతేకాకుండా ఇంటర్న్‌షిప్‌లు, ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని హామీలు ఇచ్చినట్లు సమాచారం. అతని మాటలను నమ్మిన పలువురు విద్యార్థులు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఉద్యోగ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతూ కొంతకాలం విద్యార్థులను Students నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం, ఎలాంటి నియామక ప్రక్రియ కనిపించకపోవడంతో విద్యార్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

Job Scam Fraud | మంగళగిరిలో పోలీసుల ఫిర్యాదు

తర్వాత తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ (Mangalagiri PS)ను ఆశ్రయించి విజయ్ నరసింహపై (Vijay Narasimha) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఇప్పటివరకు సుమారు రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపించార‌ని సమాచారం. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసంలో ఎంతమంది విద్యార్థులు చిక్కుకున్నారు? డబ్బు ఏ విధంగా వసూలు చేశారు? ఆ మొత్తాన్ని ఎక్కడ వినియోగించారు? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మరోసారి విద్యార్థుల్లో అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని, సంబంధిత సంస్థల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Chandrababu Population Policy | మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *