అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijayawada college harassment | విజయవాడలోని ప్రసిద్ధ డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ విద్యాకేంద్రం లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కళాశాలకు చెందిన ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇందుకు కారణంగా మారాడు. ఇతగాడు విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో విద్యా ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
Vijayawada college harassment | ప్రొఫెసర్ వేధింపులు:
బాధితులు, స్థానిక వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. కళాశాలలోని ఓ ప్రొఫెసర్ గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నల్ మార్కుల విషయంలో, పరీక్షల సమయంలో అనుకూలంగా ఉంటానంటూ విద్యార్థినులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు బాధితుల ఆరోపణ. ప్రొఫెసర్ కీచక ప్రవర్తనపై విసిగిపోయిన బాధితులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
Vijayawada college harassment | మహిళా కమిషన్ విచారణ
ఈ ఘటనపై ఓ విద్యార్థిని రాష్ట్ర మహిళా కమిషన్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో.. మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో, సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు. వేధింపుల సమస్య ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో సమస్య ఉన్నట్లు గుర్తించామన్నారు. ఓ విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. అధికారులకు విద్యార్థులు చేస్తే.. విచారణ చేపట్టారని, కానీ సదరు విచారణ సరిగా జరగలేదని తెలుస్తోందని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్‌లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

