Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్

విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్​ పలు ఆసనాలు వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lokesh Yoga Session | విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్​తో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర వాహనాన్ని జెండా ఊపి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్.. మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)తో పలు ఆసనాలు వేయించారు. లోకేశ్ ఉత్సాహంగా ఆసనాలు వేస్తుండటాన్ని చూసి, పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నవ్వారు. కాగా కష్టమైన ఆ ఆసనాలు వేయడానికి లోకేశ్​ కొంచెం శ్రమించారు.

Lokesh Yoga Session | ప్రధానికి ధన్యవాదాలు

Lokesh Yoga Session

యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి..: Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *