ఆంధ్రప్రదేశ్​Accident in Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ లారీని ఢీకొనడంతో...

Accident in Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ లారీని ఢీకొనడంతో నలుగురు మృతి

శ్రీకాళహస్తి సమీపంలో తెల్లవారుజామున జరిగిన భయానక ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్తున్న అంబులెన్స్ లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Accident in Tirupati | తిరుపతి జిల్లా (Tirupati District)లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా ప్రయాణిస్తున్న అంబులెన్స్, ముందుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న ప్రభావంతో అంబులెన్స్ (Ambulance) ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

Accident in Tirupati | డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా…

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రి (RUIA Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడ‌ని లేదంటే అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Andhra Tax Collection | ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ సృష్టించిన‌ పన్నుల వసూళ్లు.. ఏప్రిల్‌లో రూ. 5,542 కోట్ల ఆదాయం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trisha in Tirumala | తిరుమలలో దర్శనం ఇచ్చిన త్రిష‌.. విజయ్ రాజకీయ విజయానికి మొక్కులు చెల్లించిందా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trisha in Tirumala | దక్షిణాది చిత్ర పరిశ్రమలో...

TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకురావడం హర్షణీయం: టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...

Assam Election Results | అస్సాంలో హ్యాట్రిక్​ దిశగా బీజేపీ.. 91 స్థానాల్లో అధిక్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assam Election Results | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్​...

Tamil Nadu Election Trends| స్టాలిన్ వారసుడికి ఎదురుగాలి.. చెపాకంలో వెనుకంజలో ఉదయనిధి!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Election Trends|తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో...