Andhra Tax Collection | ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ సృష్టించిన‌ పన్నుల వసూళ్లు.. ఏప్రిల్‌లో రూ. 5,542 కోట్ల ఆదాయం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Tax Collection | ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లో పన్నుల వసూళ్లు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ. 5,542.7 కోట్ల ఆదాయం సమకూరింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గతేడాది ఏప్రిల్‌లో వసూలైన రూ. 4,946 కోట్లతో పోలిస్తే ఈసారి వసూళ్లు 12.08 శాతం పెరగడం గమనార్హం. ఈ వృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా భావిస్తున్నారు.ఈ గణనీయమైన పెరుగుదలకు ఆధునిక సాంకేతికత వినియోగమే ప్రధాన కారణమని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ అహ్మ‌ద్ బాబు తెలిపారు.

Andhra Tax Collection | అత్యధిక నెలవారీ ఆదాయం..

ముఖ్యంగా ఏఐ (Artificial Intelligence) ఆధారిత డేటా విశ్లేషణ, యూపీఐ లావాదేవీల పర్యవేక్షణ, డిస్కమ్‌ల డేటాతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ధ్రువీకరణ వంటి సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ చర్యల వల్ల పన్నుల లీకేజీ గణనీయంగా తగ్గడంతో పాటు, పన్ను పరిధి విస్తరించిందని అధికారులు తెలిపారు. వ్యాపార లావాదేవీలపై మరింత పర్యవేక్షణ పెరగడం వల్ల ఆదాయం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. విభాగాల వారీగా చూస్తే, నికర జీఎస్టీ వసూళ్లు 6.83 శాతం వృద్ధితో రూ. 3,796.91 కోట్లకు చేరాయి. పెట్రోలియంపై వ్యాట్ వసూళ్లలో 26.72 శాతం పెరుగుదల నమోదై రూ. 1,613.36 కోట్లుగా ఉంది. అదనంగా వృత్తి పన్ను ద్వారా రూ. 42.9 కోట్లు సమకూరాయి.

మొత్తం మీద గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి రూ. 598 కోట్ల అదనపు ఆదాయం రాష్ట్రానికి లభించింది. ఈ పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో పారదర్శకత, సాంకేతిక వినియోగం పెరిగినట్లు సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: AP WhatsApp Services | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో వైద్య సేవలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *