అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jogi Ramesh Allegations | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేశ్‌పై ఆయన కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాడానికి జోగి రమేశ్‌తో పాటు కుటుంబ సభ్యులు ప్రయత్నించారని ఆరోపించారు.
జోగి రమేశ్‌కు కుమారుడు రాజీవ్ భార్య మేఘన తన మామపై సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి ప్రయత్నించారని, అదనపు కట్నం కోసం వేధించారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వివాహం సూర్యాపేట (Suryapet)లో జరిగిందని ఆమె తెలిపారు. ఆ సమయంలో రూ.5 కోట్ల నగదుతో పాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు ఇచ్చారని పేర్కొన్నారు. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు.
Jogi Ramesh Allegations | చంపేందుకు యత్నం..
పెళ్లికి ముందే భర్తకున్న శారీరక సమస్యలను దాచిపెట్టి మోసం చేశారని మేఘన పేర్కొన్నారు. ఇంటిపై నుంచి తనను తోసేయడానికి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోవాకు వెళ్లిన సమయంలో బోటులో నుంచి నీటిలో తోసేయడానికి యత్నించారన్నారు. నార్సింగిలోని విల్లాకు తీసుకెళ్లి దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని ఆమె ఆరోపించారు. వాళ్లు చెప్పినట్లు వింటానని వేడుకోవడంతో తనను ఆ రోజు ప్రాణాలతో వదిలేశారని ఆమె చెప్పారు. వేధింపులు తాళలేక పోలీసులకు ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Bonda Uma Comments | కాపులంతా ఏకం అవుతారు.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు