Jagan Chandrababu Allegations | రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు సిండికేట్​ : వైఎస్​ జగన్​

భీమ‌వ‌రం ఆక్వా రైతుల స‌భ‌లో జగన్​ మాట్లాడారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jagan Chandrababu Allegations | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్​ జగన్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు (CM Chandrababu) సిండికేట్ రాష్ట్రాన్ని న‌డిపిస్తోందని ఆరోపించారు.

భీమ‌వ‌రం ఆక్వా రైతుల స‌భ‌లో జగన్​ మాట్లాడారు. ముందుగా కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. ఆక్వా రైతుల‌కు స‌ప్ల‌య్ చేసే సీడు, ఫీడు, పంట కొనుగోలు మొత్తం ప్ర‌క్రియ‌ చంద్ర‌బాబు సిండికేట్ న‌డిపిస్తోందని జగన్​ ఆరోపించారు. సీడు, ఫీడు రేట్లు నిర్ణ‌యించేది వాళ్లే అన్నారు. ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సాగు చేసిన‌ రొయ్య‌లు, చేప‌ల ధ‌ర‌ల‌ను సిండికేట్ ప‌డేస్తోందన్నారు. చంద్ర‌బాబు సీఎం కుర్చీలోకి వ‌స్తే సిండికేట్‌కు పండ‌గే.. పండ‌గ‌ అన్నారు.

Jagan Chandrababu Allegations | చంద్ర‌బాబు చ‌ర్మం కొంచెం మందం

సీఎం చంద్రబాబు చర్మం కొంచెం మందమని జగన్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దున్న‌పోతు వ‌ర్షం ప‌డితే ఏమాత్రం కూడా చలించ‌దో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అదే మాదిరిగా త‌యారైంద‌ని విమర్శించారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీరు, సిండికేట్​తో ఆక్వా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నరసాపురంలో తమ హయాంలో తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారని, భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Parawada Pharma Fire | పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *