Mobile Food Court | మొబైల్​ ఫుడ్​ కోర్టుగా పాత కారు.. యువత వినూత్న ఆలోచన

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mobile Food Court | దేశంలో ఎంతో మంది ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాల్లో కొలువులు లభించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో కొందరు యువత తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి ఉపాధి పొందుతున్నారు.

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆశపడకుండా, గుంటూరు (Guntur) యువకులు స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఒక పాత కారును వినూత్నంగా మొబైల్ ఫుడ్ కోర్ట్‌గా మార్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారి కోసం బొగ్గుల పొయ్యిపై కాల్చిన ‘ఆయిల్ లెస్ చికెన్ స్నాక్స్’ (Oil-free Chicken Snacks) అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీరి వినూత్న వ్యాపార ఆలోచన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Mobile Food Court | అనేక అవకాశాలు

ప్రస్తుతం ఉపాధి పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అయితే యువత ఉద్యోగం గురించే ఆలోచిస్తున్నారు. స్వయం ఉపాధి, స్టార్టప్​ల జోలికి వెళ్లడం లేదు. కొత్తగా ఆలోచించి వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు సాధించవచ్చు. క్రమశిక్షణతో వ్యాపారం చేస్తే తాము ఉపాధి పొందడంతో పాటు పలువురికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు. అయితే వ్యాపారం, స్వయం ఉపాధి అనగానే చాలా మంది భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్​ లెస్​ చికెన్ స్నాక్స్​తో గుంటూరు యువత కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు లాభాలు ఆర్జిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Tirupati ASI Drunk | తిరుపతిలో మద్యం మత్తులో ఏఎస్సై హల్​చల్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *