అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirupati ASI Drunk | భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి (Tirupati)లో ఓ ఏఎస్సై మద్యం మత్తులో హల్చల్ చేశాడు. పూటుగా తాగి ఓ హోటల్ యజమానితో గొడవ పడ్డాడు.
ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని పూర్వీక సెంటర్లో ఉన్న హోటల్ యజమానిపై ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము దాడిగి దిగారు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ యజమానిపై దాడి చేయడంతో, తిరిగి ఏఎస్ఐపై హోటల్ యజమాని దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు వారిని విడిపించారు.
Tirupati ASI Drunk | శాఖకు మచ్చ తెస్తున్నారు
కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో శాఖకు చెడ్డపేరు వస్తోంది. బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు.. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరిస్తున్నారు. పలువురు చాయ్, టిఫిన్ సెంటర్లలో డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే పోలీసులమని దబాయిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తిరుపతిలో మద్యం మత్తులో ఏఎస్ఐ హల్చల్
ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని పూర్వీక సెంటర్లో ఉన్న హోటల్ యజమానిపై దాడికి దిగిన ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము
నన్నే డబ్బులు అడుగుతావా అంటూ యజమానిపై దాడి చేయడంతో, తిరిగి ఏఎస్ఐపై దాడి చేసిన హోటల్ యజమాని pic.twitter.com/G9strjw9ce
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
ఇది కూడా చదవండి..: KNR Illegal Wealth | జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఆస్తులపై సిట్ దర్యాప్తు.. మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తుల గుర్తింపు!


