Pandu Master Accident | రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్​ మాస్టర్​ పండుకు తీవ్ర గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pandu Master Accident | విశాఖ ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఢీ షో డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు.

పండు మాస్టర్​ (Pandu Master) తగరపువలస సమీపంలో ఓ జాతరలో డ్యాన్స్ ఈవెంట్‌కు హాజరు అయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన కారును రోడ్డు పక్కన ఆపి పండు మాస్టర్​ వాంతులు చేసుకుంటుండగా కోళ్ల వ్యాన్​ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Pandu Master Accident | ఆస్పత్రికి తరలింపు

Pandu Master Accident

ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లు మోకాళ్ల కింద విరిగిపోయాయి. ఒక కాలు మోకాలు కింద, మరో కాలు పాదం దగ్గర ఫ్రాక్చర్ అయింది. అలాగే నడుము భాగంలో వెన్నెముక డిస్క్ డిస్‌లోకేట్ అయింది. ముందుగా వెన్నెముక డిస్క్, నరాలను సెట్ చేసి.. ఆ తర్వాతే కాళ్లకు సర్జరీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. కాగా ఈ కోళ్లవ్యాన్​ పండు మాస్టర్​తో పాటు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Swayambhu Poster Release | నిఖిల్ బర్త్‌డే స్పెషల్.. ‘స్వయంభూ’ నుంచి పోస్టర్​ రిలీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *