Elephant Electrocuted | విద్యుత్ షాక్​తో ఏనుగు మృతి

తిరుపతి-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని ఇరాల మండలంలో విద్యుత్​ షాక్​తో ఏనుగు చనిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Elephant Electrocuted | తిరుపతి-చిత్తూరు (Tirupati-Chittoor) జిల్లాల సరిహద్దుల్లోని ఇరాల మండలం చుక్క వారి పల్లి గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఏనుగు మృతి చెందింది. శనివారం ఉదయం తన పొలంలో అడవి ఏనుగు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటంతో రైతు ఆందోళనకు గురయ్యారు.

Elephant Electrocuted | తక్కువ ఎత్తులో విద్యుత్ లైన్లు

ఆ రైతు ఏనుగు చనిపోయిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనల ప్రకారం, ఆ ప్రాంతంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న హై-టెన్షన్ విద్యుత్ తీగలను తాకడం వల్ల ఏనుగు విద్యుదాఘాతానికి గురై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: AP Municipal Elections | ఏపీ మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ మార్పు.. నవంబర్‌ 1న పోలింగ్‌, 3న ఫలితాలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *