Gelatin Sticks Blast | జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఐదుగురు మృతి

అల్లూరి జిల్లాలో జిలెటిన్​ స్టిక్స్​ పేలి ఐదుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gelatin Sticks Blast | ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద జిలెటిన్​ స్టిక్స్​ పేలి ఒక ఉపాధ్యాయురాలితో సహా ఐదుగురు మృతి చెందారు.

పినకోట వద్ద రోడ్డు పనులు చేపడుతున్నాయి. దీంతో బండరాళ్లను పగులకొట్టడానికి జిలెటిన్​ స్టిక్స్​ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం జిలెటిన్​ స్కిక్స్​ అమర్చిన యంత్రంలో డీజిల్​ నింపుతుండగా.. ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అనంతరం పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఆ సమయంలో విధులకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు సునీత సైతం ప్రాణాలు కోల్పోయారు.

Gelatin Sticks Blast | కేసు నమోదు

ప్రమాదంలో ఆ మార్గంలో వెళ్తున్న రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల్లో టీచర్ సునీత, కార్మికుడు మణి, నారాయణరావు, పవన్‌, డ్రైవర్ ఉన్నట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Elephant Electrocuted | విద్యుత్ షాక్​తో ఏనుగు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *