అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rapido Driver Arrest | ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ముంబైలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు సోషల్ మీడియా పోస్టులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలోని మహిమ్‌కు చెందిన మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది. అక్తర్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడు. ర్యాపిడో డ్రైవర్‌గా, పెర్ఫ్యూమ్ అమ్మకందారుడిగా పని చేస్తున్న అతడికి పాకిస్తానీ గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Rapido Driver Arrest | రెచ్చగొట్టే వ్యాఖ్యలు
నిందితుడు మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు, బాబ్రీ మసీదుకు సంబంధించి JeM అధిపతి మౌలానా మసూద్ అజహర్ మాట్లాడిన ఉగ్రవాద ఆడియో క్లిప్‌లను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. వాటిలో “అబ్ జిహాద్ కా జమానా ఆగ్యా హై” (జిహాద్ సమయం వచ్చింది) వంటి జిహాద్ పిలుపులు, హింసను ప్రేరేపించడం వంటివి ఉన్నాయి. అంతేగాకుండా ప్రధాని మోదీ ముంబై పర్యటన సమయంలో ప్రధాని మోదీకి ఇందిరా గాంధీ లాంటిది ఏదైనా చేసి ఉండాల్సింది అని పోస్టు చేశారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Ritwik Jailer 2 | జైలర్–2 బుడ్డోడు చైల్డ్ ఆర్టిస్టే కాదు.. ఓ కంపెనీకి సీఈఓ కూడా!