E20 Petrol Myth | ఇథనాల్ పెట్రోల్‌కు చీమలు.. అబద్ధం!

ఇ20 పెట్రోల్ పోసిన వాహన ట్యాంకులకు చీమలు పడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: E20 Petrol Myth | భారత్ ముడి చమురుకోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో దిగుమతుల భారం తడిసిమోపెడవుతోంది. ద్రవ్యలోటు పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్‌లో ఇథనాల్ (Ethanol) బ్లెండింగ్‌కు అనుమతిస్తోంది. ప్రస్తుతం 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపి విక్రయిస్తున్నారు. పూర్తిగా ఇథనాల్ ఇంధన వినియోగం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వంద శాతం ఇథనాల్ వినియోగానికీ చట్టబద్ధమైన అనుమతులు తాజాగా జారీ చేసింది.

E20 Petrol Myth | చీమలు పట్టాయంటూ ప్రచారం..

ఇ20 పెట్రోల్ పోసిన వాహన ట్యాంకులకు చీమలు పడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలు మీడియాలలోనూ దీనికి సంబంధించిన కథనాలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే ఖండించింది. పెట్రోల్ మిశ్రమం కోసం ఉపయోగించే ఫ్యుయల్ గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో మిగిలిపోయిన చక్కెరలను తొలగిస్తారని, ఇందులో కీటకాలను దూరంగా ఉంచే డీనాచురెంట్లు ఉంటాయని పేర్కొంది.

E20 Petrol Myth | పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతోందంటే?

ఇ20 పెట్రోల్ పోసిన వాహన ట్యాంకులకు చీమలు పడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చింది. ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరుతోంది. ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని ‘ఎక్స’ వేదికగా విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి..: Chhattisgarh Sand Quarry | మైనింగ్ వివాదం.. బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *