అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bima Scheme | రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7600 మంది చనిపోయిన వారి కుటుంబాలకు రైతు బీమా డబ్బులు రాలేదన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రైతుబీమా పథకం ఉందా లేదా అనే విషయం అర్థం కావడం లేదన్నారు.
Rythu Bima Scheme | రైతులు నష్టపోతారు
ప్రభుత్వం బోనస్ ఇస్తామంటున్న 7 రకాల వడ్ల వల్ల రైతులు ఎకరానికి 10 క్వింటాళ్లు నష్టపోతారని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. అంటే ఒక్కో రైతుకు రూ. 24 వేల తక్కువ ఆదాయం వస్తుందన్నారు. 33 రకాల వడ్లలో ప్రభుత్వం గుర్తిస్తున్న 7 రకాల వడ్లు ఎకరాకి 20 క్వింటాళ్లు పండితే మిగతా 26 రకాలు మాత్రం ఎకరాకు 30 క్వింటాళ్లు పండుతాయని ఆయన పేర్కొన్నారు.
Rythu Bima Scheme | యూరియా యాప్ తొలగించాలి

యూరియా యాప్ నాకే అర్థం కాదు.. ఇక సాధారణ రైతులకు ఏం అర్థమవుతుంది అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యాప్ ఎందుకన్నారు. మార్కెట్లో యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు తీసుకురావడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Breakfast Scheme | బీఆర్ఎస్ హయాంలోనే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించాం : కేటీఆర్