అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adilabad ACB Trap | ఆదిలాబాద్ (Adilabad) జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ (AE) రూపవతి రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.
సోనాల్ గ్రామానికి చెందిన సోదరులు గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ నిర్మించుకోవాలి అనుకున్నారు. అయితే తమ వ్యవసాయ భూమి పక్క నుంచి చిన్న కాలువ వెళ్తుంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ కావాల్సి వచ్చింది. దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈఈ రాథోడ్ విఠల్ లంచం డిమాండ్ చేశాడు. రూ.60 వేలు ఇస్తేనే పని చేస్తానన్నారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం బాధితుల నుంచి ఏఈ రమేశ్ ద్వారా ఈఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.
Adilabad ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ (ACB Website) ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..
Reservation mahima