హైదరాబాద్Gandipet Land Scam | గండిపేటలో రూ.1500 కోట్ల భూ కుంభకోణం.. ముగ్గురు అరెస్ట్

Gandipet Land Scam | గండిపేటలో రూ.1500 కోట్ల భూ కుంభకోణం.. ముగ్గురు అరెస్ట్

గండిపేట పరిధిలో ఒక భారీ భూ కుంభకోణం వెలుగుచూడడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gandipet Land Scam | గండిపేట పరిధిలో ఒక భారీ భూ కుంభకోణం వెలుగుచూడడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను (Fake GOs) సృష్టించి, ఏకంగా రూ.1,500 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన నిందితుల భారీ స్కెచ్‌ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెగా ల్యాండ్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Gandipet Land Scam | ఫేక్ జీఓలతో భారీ ప్లాన్..

ప్రభుత్వ పరిధిలో ఉన్న అత్యంత విలువైన భూమిని తమ సొంతం చేసుకునేందుకు నిందితులు అత్యంత పక్కాగా వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే నకిలీ జీఓలను, డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూములను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ భారీ అక్రమాలపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన నిమ్మల రాజేష్‌గౌడ్‌, వేణుగోపాల్‌, సాయికిరణ్‌లను పోలీసులు ప్రాథమికంగా గుర్తించి ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న అధికారులు, ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
cybarabad

 

Gandipet Land Scam | వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు..

రూ.1,500 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూ ఆక్రమణల కేసులో వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అలాగే బొల్లా రమేష్‌లకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, నకిలీ పత్రాల సృష్టి , ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు యత్నించిన ఆరోపణల కింద వీరిద్దరిపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ప్రభుత్వ విభాగాల నుంచి ఎవరైనా నిందితులకు సహకరించారా? అనే కోణంలో సైబరాబాద్ పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.
Untitled 6

ఇది కూడా చదవండి: Telangana Employee Arrears | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...