అక్షరటుడే, వెబ్‌డెస్క్: Land Acquisition | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్ సమీపంలోని బహుదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది. సరైన పరిహారం, హామీలు ఇచ్చే వరకు భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం భూములు సేకరిస్తోంది. బహదూర్‌గూడలో 650 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అయితే ఆ భూములు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. సరైన పరిహారం ఇచ్చాకే భూములు ఇస్తామని ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పోలీసులు, హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
Land Acquisition | అరెస్ట్‌తో తోపులాట

గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి జేసీబీలో సాయంతో అధికారులు యత్నించారు. అయితే రైతులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తోపులాట సైతం చోటు చేసుకుంది. అయినా పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ తోపులాటలో ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. కాగా రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. వారికి మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్