అక్షరటుడే, వెబ్‌డెస్క్ : H Fast Inspection | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆహార కల్తీ ఆగడం లేదు. హెచ్ ఫాస్ట్ బృందం అధికారులు తనిఖీలు చేపట్టి, కేసులు నమోదు చేస్తున్నా.. కల్తీ ముఠాలు భయపడటం లేదు. యథేచ్ఛగా ఆహార పదార్థాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యం చెలగాటం ఆడుతున్నారు.
ప్రజలు ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీనిని తయారీలో కొందరు నిబంధనలు పాటించడం లేదు. హైదరాబాద్‌లోని ఒక తయారీ యూనిట్‌లో హెచ్ ఫాస్ట్ బృందం అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. కలుషితమైన నీటిలో ముంచిన ప్రొడక్షన్ ట్రేలను ఉపయోగించి బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఉస్మానియా బిస్కెట్లు, మస్కా బన్స్, క్రీమ్ రోల్స్, మైసూర్ పాక్, స్వీట్లు, కేకులు, కుకీలను ఉత్పత్తి చేసే యూనిట్లపై హెచ్-ఫాస్ట్ (H Fast Inspection) జరిపిన దాడులలో, తీవ్రమైన కీటకాల వ్యాప్తి, అపరిశుభ్రమైన పరిస్థితులు, తప్పుడు లేబుల్ ఉన్న వంట నూనె, అనధికారిక సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యూనిట్‌పై కేసు నమోదు చేశారు.
H Fast Inspection | 850 కిలోల నకిలీ నెయ్యి స్వాధీనం
తెలంగాణలో ఆహార భద్రతా అధికారులు జూలై 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఒక భారీ కల్తీ దందాను వెలికితీసి, 850 కిలోల నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అందులో 60 కిలోలు తినడానికి సురక్షితం కాకపోవడంతో అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఆహార భద్రతా కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ బృందాలు 65 సంస్థలపై దాడులు చేశాయని తెలిపారు.
🚨 H-FAST Raids on Sweet & Biscuit Manufacturing Units
H-FAST Team, along with FSO Dyvanidhi detected unhygienic conditions, pest infestation, and other food safety violations at units manufacturing sweets, cakes, cookies, and Osmania biscuits. Action has been initiated. pic.twitter.com/IIJfzafIXt— Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) July 17, 2026
దీనిని కూడా చదవండి : Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఒకరికి రూ.5 వేల జరిమానా